Share News

ఒంగోలులో కారు హల్‌చల్‌.. నిందితుడు గుర్తింపు

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:00 PM

ఒంగోలు రత్నమహల్‌ సెంటర్‌లో ఓ వ్యక్తి కారుతో హల్‌చల్‌ చేశాడు. గురువారం ఉదయం పెళ్లూరు వైపు నుంచి ఒంగోలులోకి వెళుతున్న కారు స్థానిక రత్నమహల్‌ సెంటర్‌ వద్ద హల్‌చల్‌ చేసి చోదకుడు ప్రమాదానికి గురయ్యాడు.

ఒంగోలులో కారు హల్‌చల్‌.. నిందితుడు గుర్తింపు

ఒంగోలు క్రైం, ఆగస్టు20 (ఆంధ్రజ్యోతి) : స్థానిక రత్నమహల్‌ సెంటర్‌లో ఓ వ్యక్తి కారుతో హల్‌చల్‌ చేశాడు. గురువారం ఉదయం పెళ్లూరు వైపు నుంచి ఒంగోలులోకి వెళుతున్న కారు స్థానిక రత్నమహల్‌ సెంటర్‌ వద్ద హల్‌చల్‌ చేసి చోదకుడు ప్రమాదానికి గురయ్యాడు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు. వివరాలలోకి వెళితే... పెళ్లూరు వైపు నుంచి ఒంగోలులోకి అత్యంత వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ట్రాఫిక్‌ అవుట్‌ పోస్టును ఢీకొట్టాడు. అనంతరం ఇస్మాయిల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టి పక్కనే పార్కు చేసిన కారును ఢీకొట్టాడు. దీంతో కారు ధ్వంసమైంది. కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడు రిమ్స్‌కు వెళుతున్నట్లు వెళ్లి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈమేరకు పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొన్నారు. కారు నడుపుతున్న వ్యక్తి ఏడుగుండ్లపాడుకు చెందిన పి.విష్ణువర్దనరెడ్డిగా గుర్తించారు. కేసు నమోదు చేస్తామని వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Aug 20 , 2026 | 11:01 PM