Share News

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటిన్‌లు

ABN , Publish Date - Apr 15 , 2026 | 11:31 PM

పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం అన్నా క్యాంటిన్‌లను ఏర్పాటు చేసిందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.

పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటిన్‌లు
అన్నం వడ్డిస్తున్న డాక్టర్‌ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాపారావు, డాక్టర్‌ లలిత్‌ సాగర్‌

నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి,ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి) : పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం అన్నా క్యాంటిన్‌లను ఏర్పాటు చేసిందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 అన్నా క్యాంటిన్‌లను సీఎం చంద్రబాబు బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. అందులో భాగంగా దర్శి పట్టణం కురిచేడు రోడ్డులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటిన్‌ను డాక్టర్‌ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్‌ పేదలకు కూడు, గుడ్డ, నీడ కల్పించాలన్న లక్ష్యంతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు నడిపించేందుకు సీఎం చంద్రబాబు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటిన్‌లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. రోజూ కేవలం ఐదు రూపాయలకు ఉదయం టిఫిన్‌ , భోజనం అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నియోజకవర్గ టీడీపీ నాయకులు డాక్టర్‌ కడియాల లలిత్‌ సాగర్‌, తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌, కమిషనర్‌ శ్రీరామ్మూర్తి, మన్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారంనాగవేణి సుబ్బారావు, తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ మండలాల టీడీపీ అధ్యక్షులు పిడతల నెమలయ్య, కూరపాటి శ్రీనివాసౄరావు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, మోడి ఆంజనేయులు, దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్న, శాలివాహన కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మాడపాకుల శ్రీనివాసరావు, రాష్ట్ర నాటక అకాడమీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బీ ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 11:31 PM