వ్యాక్సినేషన్‌తో క్యాన్సర్ నివారణ
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:25 PM
జిల్లాలో గర్భాశయ ముఖ ద్వారా కాన్సర్‌ను నివారించేందుకు 14నుంచి 15 ఏళ్లలోపు బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు.
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గర్భాశయ ముఖ ద్వారా కాన్సర్‌ను నివారించేందుకు 14నుంచి 15 ఏళ్లలోపు బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక బృందావనం ఫంక్షన్ హాలు వద్ద వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బాలికలు విధిగా సింగిల్ డోస్ టీకాలను వేయించుకోవాలన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ వ్యాధి నివారణకు ఉచితంగా వేసే టీకాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో 11వేల మంది బాలికలకు ఈ టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలను వేస్తున్నామని, తల్లిదండ్రులు తమ బాలికలకు టీకాలను వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీప్రసన్న, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కమలశ్రీ, డాకర్లు హెన్నా కీర్తన, సుందరప్రసాద్, జిల్లా మాస్ మీడియా అధికారులు నరసింహారావు, శ్రీనివాసులు ఉన్నారు.