Share News

కాలువ కట్టలు కనుమరుగు

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:35 AM

గుండ్లకమ్మ నది నుంచి భవనాసి చెరువుకు నీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన కాలువ కట్టలు కనుమరుగవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపార్టీ నేతలు ఇష్టానుసారం కట్టలను తవ్వి గ్రావెల్‌ను తరలించి సొమ్ముచేసుకున్నారు.

కాలువ కట్టలు కనుమరుగు
కాలువ కట్టల మట్టి తరలించడంతో ఖాళీగా ఉన్న ప్రాంతం

మట్టి తవ్వి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లకు తరలింపు

అక్కడి భూమిని ఆక్రమించుకుంటున్న రైతులు

అద్దంకి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గుండ్లకమ్మ నది నుంచి భవనాసి చెరువుకు నీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసిన కాలువ కట్టలు కనుమరుగవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆపార్టీ నేతలు ఇష్టానుసారం కట్టలను తవ్వి గ్రావెల్‌ను తరలించి సొమ్ముచేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరంభంలో కొంతమంది చాటుమా టుగా కాలువ కట్టల గ్రావెల్‌ తరలిం చినా అనంతరం నిలిచిపోయింది. గత వారం రోజులుగా మరలా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి సమయాలలో భారీ యంత్రాలు, టిప్పర్‌లు వినియోగించి గ్రావెల్‌ను వెంచర్‌లకు తరలిస్తున్నారు. దీంతో కిలోమీటర్ల దూరం కాలువ కట్టలు ఆనవాళ్లు లేకుండాపోయాయి. ఇప్పటికే చాలాచోట్ల కాలువ కట్టలు ఉండాల్సిన ప్రాంతం చదునుగా మారింది. దాన్ని పక్క పొలాల రైతులు ఆక్రమించుకుంటున్నారు. దీంతో భవిష్యత్‌లో రాకపోకలకు కూడా అవకాశం లేకుండాపోయే పరిస్థితి నెలకొననుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలువ కట్టల గ్రావెల్‌ తరలింపును అడ్డుకోవడంతోపాటు, తవ్వకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈవిషయమై ఇరిగేషన్‌ ఏఈ నారాయణ స్వామిని వివరణ కోరగా.. విచారించి బాఽధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Updated Date - Jan 24 , 2026 | 01:35 AM