Share News

కనిగిరిలో పంచాయతీ ఎన్నికల సందడి

ABN , Publish Date - Nov 12 , 2026 | 10:55 PM

రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 నిర్వహణకు మార్కాపురం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ మేరకు కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కోసం మొత్తం 31 క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం విజయసునీత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు

కనిగిరిలో పంచాయతీ ఎన్నికల సందడి

నేడు విడుదల కానున్న నోటిఫికేషన్‌

కనిగిరి నియోజకవర్గంలో 135 పంచాయతీలు, 1254 వార్డులు

31 క్లస్టర్‌లు ఏర్పాటు చేసిన అధికారులు

ఆరు మండలాల్లో నామినేషన్‌ కేంద్రాలు ఖరారు

స్టేజ్‌ - 1 రిటర్నింగ్‌ అధికారులు నియామకం

కనిగిరి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2026 నిర్వహణకు మార్కాపురం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ మేరకు కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ కోసం మొత్తం 31 క్లస్టర్లను ఏర్పాటు చేస్తూ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం విజయసునీత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ ఉత్తర్వుల ప్రకారం కనిగిరి మండలంలో 6, పీసీపల్లిలో 4, హెచ్‌ఎంపాడు మండలంలో 5, సీఎ్‌సపురం మండలంలో 6, వెలిగండ్లలో 5, పామూరు మండలంలో 5 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌కు ప్రత్యేక నామినేషన్‌ కేంద్రాన్ని కేటాయించి, అక్కడ విధులు నిర్వహించేందుకు స్టేజ్‌ - 1 రిటర్నింగ్‌ అధికారులను నియమించారు.

కనిగిరి నియోజకవర్గంలో 135 పంచాయతీలు ఉండగా, 1,254 వార్డులు ఉన్నాయి. ఈ మేరకు గురువారం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ కానుండగా, ఈనెల 15, 16, 17 తేదీల్లో నామినేషన్‌ల ఉన్నాయి.

పీసీపల్లి మండలంలో ః పెద్దచెర్లోపల్లి, పెదఅలవలపాడు, పెద్ద ఇర్లపాడు, నేరేడుపల్లి క్లస్టర్‌లను ఏర్పాటు ప్రక్రియ జరుగుతుంది. ఈ మేరకు అధికారులు నియోజకవర్గంలో నామినేషన్‌ క్లస్టర్‌లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా

కనిగిరి మండలంలో ః తాళ్లూరు, ఏరువారిపల్లి, తక్కెళ్లపాడు, గురవాజీపేట, చాకిరాల, చల్లగిరగల క్లస్టర్లుగా చేశారు.

హెచ్‌ఎంపాడు మండలంలో హనుమంతునిపాడు, తిమ్మారెడ్డిపల్లి, వేములపాడు, నందనవనం, సీతారామపురం క్లస్టర్లు ఉన్నాయి.

సీఎ్‌సపురంలో ః చంద్రశేఖరపురం - 1, దర్శిగుంటపేట, కంభంపాడు, కోవిలంపాడు, పెదగోగులపల్లి, గణేశునిపల్లి క్లస్టర్లను గుర్తించారు.

వెలిగండ్ల మండలంలో ః పందువ నాగులవరం, వెలిగండ్ల, మొగళ్లూరు, నాగిరెడ్డిపల్లి, ఇమ్మడిచెరువు, క్లస్టర్లను ఏర్పాటు చేశారు.

పామూరు మండలంలో ః బొట్లగూడురు, దాదిరెడ్డిపల్లి, వగ్గంపల్లి, పామూరు - 1, మోపాడు క్లస్టర్లుగా ఉన్నాయి. ఆయా క్లస్టర్‌లకు కే వెంకటేశ్వర్లు, జే ప్రసాదరావు, ఎస్‌ఎం షరీఫ్‌, సీహెచ్‌ వెంకటేశ్వర్లు, బీ సుధాకర్‌ర్‌రెడ్డి, సీహెచ్‌ శ్రీనివాసులు తదితర అధికారులను స్టేజ్‌ - 1 రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. నియమితులైన అధికారులు వెంటనే తమకు కేటాయించిన మండలాల్లో విధుల్లో చేరి ఎన్నికల సామగ్రి, సూచనలు స్వీకరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు సంబంధిత అధికారులకు ఉత్తర్వులను అందచేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విధుల్లో చేరిన అధికారులు తమ జాయినింగ్‌ రిపోర్టులను జిల్లా పంచాయతీ అధికారి, అదనపు జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని స్పష్టం చేశారు.

Updated Date - Nov 12 , 2026 | 10:55 PM