సామాన్యులపై ‘బండ’
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:29 AM
వంట గ్యాస్ ధర రాత్రికి రాత్రే పెరగడంతో వినియోగదారులపై భారీగా భారం పడింది. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడటంతో ధరలు పెరిగినట్లు సమాచారం. సాధారణ సిలిండర్‌కు రూ.60, కమర్షిల్ సిలిండర్‌కు రూ.115 పెరిగింది.
పెరిగిన గ్యాస్ ధర
ఒక్కో సిలిండర్‌కు రూ.60 వడ్డన
కమర్షియల్‌పై రూ.115 పెరుగుదల
జిల్లా ప్రజానీకంపై రోజుకు రూ.14 లక్షల భారం
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : వంట గ్యాస్ ధర రాత్రికి రాత్రే పెరగడంతో వినియోగదారులపై భారీగా భారం పడింది. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడటంతో ధరలు పెరిగినట్లు సమాచారం. సాధారణ సిలిండర్‌కు రూ.60, కమర్షిల్ సిలిండర్‌కు రూ.115 పెరిగింది. జిల్లావ్యాప్తంగా 49 గ్యాస్ కంపెనీల పరిధిలో 6,82,437 మంది వినియోగదారులు ఉన్నారు. రోజువారీ 25వేలకుపైగా సిలిండర్ల అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం ఒక్కో దానిపై రూ.60 పెరిగింది. ఆవిధంగా జిల్లావ్యాప్తంగా రోజువారీ సుమారు రూ.14 లక్షలకుపైన, నెలకు సుమారు రూ.50 లక్షలు ప్రజలపై భారం పడుతోంది. జిల్లాలో శుక్రవారం సాధారణ సిలిండర్ రూ.898 ఉండగా శనివారం రూ.958కి చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర శుక్రవారం రూ.1,983 ఉండగా శనివారం రూ.2,100కు పెరిగింది. చిన్నచిన్న టిఫిన్ దుకాణాల్లో కమర్షియల్ సిలిండర్లను అధికంగా వినియోగిస్తారు. గ్యాస్ ధర పెరగడం వల్ల ఆ భారం కూడా ప్రజలపై పడనుంది.