ఒంగోలులో కలకలం రేపిన యువతి మృతదేహం
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:28 PM
గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం ఒంగోలు శివారు ప్రాంతంలోని పల్నాడు ఫర్నీచర్ సమీపంలో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగిన యువతి అనుమానాస్పదరీతిలో మృతి చెంది ఉంది.
మూడురోజుల క్రితం చనిపోయి ఉంటుందని భావిస్తున్న పోలీసులు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
ఒంగోలు క్రైం, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి) : గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం ఒంగోలు శివారు ప్రాంతంలోని పల్నాడు ఫర్నీచర్ సమీపంలో గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగిన యువతి అనుమానాస్పదరీతిలో మృతి చెంది ఉంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిఉంది. సుమారు మూడు రోజుల క్రితం మరణించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె రంగు పూల డిజైన్ గల ఫుల్ హ్యాండ్స్ చొక్కా, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉంది. ఆ ప్రాంతంలో ఓ నల్లటి లగేజీ బ్యాగ్, రోజ్ కలర్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఉన్నాయి. ఆ బ్యాగ్‌లో చిన్న పిల్లల డ్రస్సులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు శరీరం పూర్తిగా ఉబ్బి కుళ్లిపోయి ఉండటంతో ఎలాంటి గాయాలు కనిపించడం లేదు. ఈ మేరకు తాలుకా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రహదారికి సమీపంలో యువతి మృతదేహం లభ్యం కావడం, ఆమె వద్ద లగేజీ బ్యాగ్‌లు ఉండటం కలకలం రేపుతోంది. యువతి నిర్మానుష్య ప్రదేశంలో ఎలా మృతి చెందిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.