దిద్దుబాటు చర్యలపై బోర్డు దృష్టి
ABN , Publish Date - Jun 21 , 2026 | 03:02 AM
పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిత్యం పలు కేంద్రాల్లో వేలం ఆగిపోవడం.. ఒకవేళ జరిగినా పెద్దసంఖ్యలో బేళ్లు నోబిడ్ అవుతుండటంతో తొలుత వాటి తగ్గింపు, తర్వా త వేలం కొనసాగడం కోసం చర్యలు అత్యవస రంగా భావించారు.
రీజియన్ స్థాయిలో పొగాకు రైతు, వ్యాపార ప్రతినిధులతో కమిటీలు
ఒంగోలులో రెండు కమిటీలతో బోర్డు సెక్రటరీ వేణుగోపాల్ భేటీ
మార్కెట్లో కొనసాగుతున్న సంక్షోభం 8 ఐదు కేంద్రాల్లో ఆగిన వేలం
ఒంగోలు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభంపై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలపై బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిత్యం పలు కేంద్రాల్లో వేలం ఆగిపోవడం.. ఒకవేళ జరిగినా పెద్దసంఖ్యలో బేళ్లు నోబిడ్ అవుతుండటంతో తొలుత వాటి తగ్గింపు, తర్వా త వేలం కొనసాగడం కోసం చర్యలు అత్యవస రంగా భావించారు. అందుకు కేవలం స్థానిక వేలం కేంద్ర అధికారుల ప్రయత్నం మాత్రమే చాలదన్న విషయాన్ని గుర్తించారు. రీజియన్ స్థాయిలో రైతు, వ్యాపార ప్రతినిధులతో కమిటీ లను ఏర్పాటు చేశారు. అలా ఎస్‌బీఎస్ రీజియ న్‌కు రైతు ప్రతినిధులుగా వడ్డెళ్ల ప్రసాద్, పోతుల నరసింహారావు, నాగినేని భాస్కర్‌ను.. ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌కు తానికొండ రమణయ్య, మరో ఇద్దరిని నియమించారు. కీలక కంపెనీలైన ఐటీసీ, జీపీఐల తరఫున ఒక్కొక్కరు కమిటీలో ఉండనున్నారు. అలా ఏర్పాటు చేసిన కమిటీల సభ్యులతో పొగాకు బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్ శనివారం సాయంత్రం ఇక్కడి ఆర్‌ఎం కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రాంతీయ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజువారీ ఆయా కేంద్రాల్లో ఎదురవుతున్న పరిస్థితులపై చర్చించారు. ఆందోళనల సమయంలో అటు రైతులు, ఇటు వ్యాపారులను సమన్వయం చేయాలని కమిటీ సభ్యులకు బోర్డు సెక్రటరీ వేణుగోపాల్ సూచించారు. పలు ఇతర అంశాలపై వారు మాట్లాడుకొని వేలం సజావుగా సాగేలా చూడాలన్నారు. ఇదిలాఉండగా శనివారం కూడా పొగాకు మార్కెట్ ముందుకు సాగలేదు. దక్షిణాది రీజియన్‌లోని టంగుటూరు, కందుకూరు-1, కొండపి, పొదిలి, ఒంగోలు-1 కేంద్రాల్లో వేలం నిలిచిపోయింది పొదిలిలో రైతులు వేలాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. ఇతర కేంద్రాల్లో వేలం సాగినప్పటికీ ధరల్లో మార్పు లేదు. కనిష్ఠ ధరలు కిలో రూ.160గా పలు కేంద్రాల్లో ఉండటంతో భారీగానే బేళ్లు నోబిడ్ అయ్యాయి.