Share News

సంక్షోభ నివారణపై బోర్డు కసరత్తు

ABN , Publish Date - Jun 24 , 2026 | 02:57 AM

పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభ నివారణపై బోర్డు అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ధరలు సరిలేక రైతులు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) చేపట్టిన నిరసనలు, ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతం కావడం, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి సమీక్ష చేసి రైతుల తరఫున గట్టిగా మాట్లాడటంతో బోర్డు అధికారులు కదిలారు.

సంక్షోభ నివారణపై బోర్డు కసరత్తు
పొగాకు బోర్డు ఈడీతో చర్చలకు హాజరైన చుండూరి రంగారావు, ఇతర నేతలు

దక్షిణాది కేంద్రాలన్నింటిలో సాగిన పొగాకు వేలం

స్వల్పంగా తగ్గిన నోబిడ్‌లు.. రేపు పొగాకు బోర్డు సమావేశం

ప్రస్తుత మార్కెట్‌ తీరుపై చర్చ... ఎస్‌కేఎం ప్రతినిధులతో ఈడీ భేటీ

దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసిన రైతు సంఘాల నేతలు

ఒంగోలు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): పొగాకు మార్కెట్లో నెలకొన్న సంక్షోభ నివారణపై బోర్డు అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ధరలు సరిలేక రైతులు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) చేపట్టిన నిరసనలు, ట్రాక్టర్ల ర్యాలీ విజయవంతం కావడం, సీఎం చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి సమీక్ష చేసి రైతుల తరఫున గట్టిగా మాట్లాడటంతో బోర్డు అధికారులు కదిలారు. నాలుగైదు రోజులుగా కొనుగోళ్ల పునరుద్ధరణపై దృష్టి సారించారు. బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్‌ జిల్లాలోని పలు వేలం కేంద్రాలను సందర్శించి అక్కడి రైతులతో.. రీజియన్ల వారీ ఏర్పాటుచేసిన రైతు, వ్యాపార ప్రతినిధుల కమిటీలతో చర్చలు జరిపారు. ఒంగోలు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): గుంటూ రులోని ప్రధాన కార్యాలయంలో ఈనెల 25న పొగాకు బోర్డు పాలకమండలి సమావేశం జరగనుంది. ప్రస్తుత మార్కెట్‌ పోకడ, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. వచ్చే ఏడాది పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఖరారును నిర్ణయించనున్నారు. ఈ అంశాలను రైతుల్లోకి అధికారులు తీసుకెళ్లి వేలం కొనసాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మంగళవారం దక్షిణాదిలోని అన్ని కేంద్రాల్లోనూ వేలం సాగింది. ధరలు గరిష్ఠంగా కిలో రూ.250, కనిష్ఠంగా రూ.160 ఉన్నప్పటికీ గతంతో పోల్చితే నోబిడ్‌ల సంఖ్య తగ్గింది. అయితే సీఎం ఆదేశించిన ప్రకారం ధరలు మాత్రం లభించడం లేదు. ఈ విషయమై జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి రెండు, మూడుసార్లు బోర్డు ఈడీ విశ్వశ్రీ, సెక్రటరీ దివి వేణుగోపాల్‌తో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

ఆందోళనలు కొనసాగిస్తాం

సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నాయ కులు ఈనెల 24 నుంచి ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద రిలే దీక్షలకు పిలుపునిచ్చారు. ఈ నేప థ్యంలో బోర్డు ఉన్నతస్థాయి అధికారుల ఆహ్వా నం మేరకు ఎస్‌కేఎం నాయకులు మంగళవా రం గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాల యంలో ఈడీ విశ్వశ్రీ నిర్వహించిన చర్చలకు హాజరయ్యారు. ఈనెల 25న బోర్డు మీటింగ్‌ ఉన్నందున అప్పటివరకు ఆందోళన వాయిదా వేయాలని బోర్డు అధికారులు కోరారు. సగటు న కిలోకు రూ.250 వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

రైతు ప్రతినిధులతో ఆర్‌ఎం సమావేశం

బోర్డు సమావేశం గురువారం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి ఆర్‌ఎం ప్రసాద్‌ దక్షిణాది వేలం కేంద్రాల రైతు ప్రతినిధులతో మంగళవారం ఒంగోలులో సమావేశం నిర్వహించారు. సాగు, ఉత్పత్తి పరిమాణంపై అభిప్రాయాలను కోరారు. అయితే వ్యాపారులు ఎంత కొనుగోలు చేస్తారు, ఎంత ధర ఇస్తారన్నది ముందు వారి నుంచి స్పష్టత తీసుకొని తదనుగుణంగా ఉత్పత్తిపై నిర్ణయం తీసుకోవాలని ఆ సమావేశంలో రైతు ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. అన్ని ప్రాంతాలకు ఒకే పద్ధతిలో ఉత్పత్తి పరిమాణం ఉండేలా చూడాలని కోరారు.

Updated Date - Jun 24 , 2026 | 02:57 AM