భానుడి ప్రతాపం.. వైద్యశాఖ అప్రమత్తం
ABN , Publish Date - Apr 19 , 2026 | 02:37 AM
జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.
గ్రామగ్రామానా అందుబాటులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు
పీహెచ్‌సీల్లో బెడ్స్‌తోపాటు ఐస్ ప్యాక్‌లు సిద్ధం
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
ప్రజల దాహార్తిని తీర్చేందుకు భారీగా చలివేంద్రాల ఏర్పాటు
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. వైద్యశాఖ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రతతో వడదెబ్బ బారిన పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. గ్రామాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వాటిని వినియోగించడం ద్వారా ఎండ తీవ్రత వల్ల వచ్చే వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని చెప్తున్నారు.
తగిన జాగ్రత్తలు అవసరం
ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు ఎండ సమయంలో బయటకు రాకుండా ఉండాలని వైద్యులు సూచి స్తున్నారు. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎవ రైనా వడదెబ్బ బారిన పడితే వెంటనే నీడ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి చల్లటి నీళ్లను తాగించడంతో పాటు చల్లటి నీటిలో పల్చటి వస్త్రాన్ని ముంచి దా నితో శరీరాన్ని తుడవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని వివరిస్తున్నారు. వడదెబ్బకు గురైన వారికి వెంటనే చికిత్స అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కో పీహెచ్‌సీలో ప్రత్యేకంగా రెండు బెడ్లను కేటాయిం చారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. పీహెచ్‌సీల్లో కూడా వడదెబ్బ నుంచి కోలుకోకపోతే వెంటనే మెరుగైన కూడా వడదెబ్బ నుంచి కోలుకోకపోతే వెంటనే మెరుగైన వైద్యం కోసం తరలించేందుకు 108 అంబులెన్స్‌లను కూడా అందుబాటులో ఉంచారు. పంచాయతీశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో సుమారు 400కుపైగా చలివేంద్రాలను ఏర్పాటుశారు. కొన్ని ప్రాంతాల్లో దాతల సహకారంతో మజ్జిగను కూడా ఆ చలివేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చారు.