Share News

సీఎంవో సూపర్‌ ఆడిట్‌లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అధికారిగా పీసీపల్లి ఎంపీడీవో

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:21 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో సమర్థవంతమైన పనితీరుతో పీసీపల్లి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి జి.వి.క్రిష్ణారావు తన ప్రతిభను చాటుకున్నారు. మార్కాపురం జిల్లా పరిధిలో ముఖ్యమంత్రి(సీఎంవో) కార్యాలయం నిర్వహించిన సూపర్‌ ఆడిట్‌లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అధికారిగా ఆయనకు గుర్తింపు లభించింది.

సీఎంవో సూపర్‌ ఆడిట్‌లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌   అధికారిగా పీసీపల్లి ఎంపీడీవో

ప్రజాసమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవకు అభినందనలు

పీసీపల్లి, జూలై 9(ఆంధ్రజ్యోతి) : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో సమర్థవంతమైన పనితీరుతో పీసీపల్లి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి జి.వి.క్రిష్ణారావు తన ప్రతిభను చాటుకున్నారు. మార్కాపురం జిల్లా పరిధిలో ముఖ్యమంత్రి(సీఎంవో) కార్యాలయం నిర్వహించిన సూపర్‌ ఆడిట్‌లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అధికారిగా ఆయనకు గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా సీఎంవో విడుదల చేసిన ఆడిట్‌ పరిశీలన నివేదికలో ఎంపీడీవో సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆ మేరకు సీఎంవో కార్యాలయం నుంచి అధికారిక ప్రశంసాపత్రాన్ని గురువారం విడుదల చేసింది. ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఎంఆర్‌కేపీ 202603166539 ఐడీతో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు నమోదైంది. స్వయంగా స్పందించిన ఎంపీడీవో ఫిర్యాదుదారునితో స్వయంగా మాట్లాడి పరిశీలించి సంస్థకు సంబంధించిన అన్ని అంశాలను స్పష్టంగా వివరించారు. అంతే కాకుండా సంబంధిత వివరాలతో కూడిన సమగ్ర ఎండోర్స్‌మెంట్‌ను అందించిన ఆయన అవసరమైన మార్గనిర్దేశం చేశారు. దీంతో ఫిర్యాదు దారుడు సమస్య పరిష్కారంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సీఎంవో సూపర్‌ ఆడిట్‌ నివేదిక వెల్లడించింది. సీఎంవో సూపర్‌ ఆడిట్‌ బృందం కూడా ఎంపీడీవో క్రిష్ణారావు స్పందించిన తీరు, పారదర్శకత, ప్రజల పట్ల బాధ్యతాయుత వైఖరి, ఫిర్యాదుల పరిష్కారంలో ఆ యన చూపిన చొరవను ఆడిట్‌ బృందం అభినందించింది. ప్రశంసలు అందుకున్న జి.వి.క్రిష్ణారావుకు అధికారులు, కార్యాలయాల సిబ్బం ది అభినందనలు తెలిపారు.

Updated Date - Jul 09 , 2026 | 11:21 PM