శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:51 AM
యద్దనపూడి మండల పరిధిలోని అనంతవరం గ్రామంలో శుక్రవారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
యద్దనపూడి (మార్టూరు)ఫిబ్రవరి27(ఆంధ్రజ్యోతి): యద్దనపూడి మండల పరిధిలోని అనంతవరం గ్రామంలో శుక్రవారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏవో కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం శనగ రైతుల కోసం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. దళారుల బెడద లేకుండా రైతులు నేరుగా శనగలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. అదేవిధంగా శనగలు అమ్మే రైతులకు 15 రోజుల్లో సొమ్ము జమచేస్తారన్నారు. శనగలను అమ్ముకోవాలనుకునే రైతులు ముందుగా రైతుసేవా కేంద్రంలో సీఎం యాప్ ద్వారా నమోదు చేయించుకోవాలన్నారు. క్వింటా మద్దతు ధర రూ.5,875 లుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుదే తారకరామారావు, నల్లపనేని రంగయ్యచౌదరి, కోయ సతీష్, కనపర్తి నాగేశ్వరరావు, రావిపాటి సీతయ్య, బోయపాటి సాంబయ్య,అనిల్ ,కొర్రపాటి వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
చినగంజాం : ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చింతగుంపల్లె పీఏసీఎస్ చైర్మన్ బత్తల శ్రీనివాసరావు అన్నారు. చినగంజాంలోని పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనగల మద్దతు ధర రూ.5,875లుగా నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న రైతులకు పంట కొనే తేదీని సెల్‌ఫోన్‌లో తెలియజేస్తారన్నారు. కొనుగోలు పూర్తయిన తరువాత ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు జమ చేయనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె.ప్రభాకరరావు, టీడీపీ మండల అధ్యక్షులు పొద వీరయ్య, చింత గుంపల్లె పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు టి.జయరావు, ఉపసర్పంచ్ చెరుకూరి రాఘవయ్య, పీఏసీఎస్ సీఈవో జి.శేఖర్‌బాబు, ఏవో ఆర్.చంద్రశేఖర్,, ఇన్‌చార్జ్ ఆర్‌ఐ బండారు దానియేలు, సిబ్బంది నాగబాబు, వీరయ్య, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.