రెండో దశ ప్రారంభం
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:29 AM
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిధిలో ఉన్న పది మండలాల్లోని 198 గ్రామ పంచాయతీలు, 2,014 వార్డు సభ్యుల ఎన్నికకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసి నామినేషన్లను స్వీకరించారు.
సర్పంచ్‌లకు 160, వార్డు సభ్యుల పదవులకు 177 నామినేషన్లు
ఒంగోలు కలెక్టరేట్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిధిలో ఉన్న పది మండలాల్లోని 198 గ్రామ పంచాయతీలు, 2,014 వార్డు సభ్యుల ఎన్నికకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసి నామినేషన్లను స్వీకరించారు. ఆయా గ్రామ పంచాయతీలను క్లస్టర్లుగా విభజించి రెండు, మూడు పంచాయతీలకు ఒకచోట నామినేషన్లను స్వీకరించే ప్రక్రియను చేపట్టారు. మొదటి రోజైన బుధవారం పలు ప్రాంతాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి రోజు సర్పంచ్ పదవులకు 160, వార్డు పదవులకు 177 నామినేషన్లు అందజేశారు. నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేశారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులను అడ్డుకోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. దీంతో మొదటిరోజు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.