గుండమాలకు అవార్డు
ABN , Publish Date - Jun 04 , 2026 | 03:20 AM
కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్‌రంజన్‌సింగ్ చేతుల మీదుగా డీపీవో ఎం.వెంకటేశ్వరరావు, గుండమాల పంచాయతీ కార్యదర్శి లావణ్యలు స్వయం సమృద్ధి అవార్డును అందుకున్నారు.
ఢిల్లీలో అందుకున్న డీపీవో, పంచాయతీ కార్యదర్శి
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : కొత్తపట్నం మండలం గుండమాల గ్రామ పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్‌రంజన్‌సింగ్ చేతుల మీదుగా డీపీవో ఎం.వెంకటేశ్వరరావు, గుండమాల పంచాయతీ కార్యదర్శి లావణ్యలు స్వయం సమృద్ధి అవార్డును అందుకున్నారు. దీంతోపాటు రూ.25లక్షల బహుమతిని, ప్రశంసాపత్రాన్ని కూడా స్వీకరించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, స్వయం సమృద్ధి సాధనలో చూపిన ప్రతిభకుగాను గుండమాలకు ఈ అవా ర్డు దక్కింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామప్రజల సమష్టి కృషితోనే ఈ పురస్కారం సాధ్యమైందని డీపీవో తెలిపారు.