ఆటో బోల్తా.. 13 మందికి గాయాలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:19 PM
ఆటో బోల్తాపడి 13మందికి గాయాలయ్యాయి. ఈఘటన గురువారం ఉదయం మండలంలోని బోదనంపాడు వద్ద చోటుచేసుకుంది.
- దశదిన కర్మకు వె ళ్తుండగా ప్రమాదం
కురిచేడు, జూలై 23(ఆంధ్రజ్యోతి): ఆటో బోల్తాపడి 13మందికి గాయాలయ్యాయి. ఈఘటన గురువారం ఉదయం మండలంలోని బోదనంపాడు వద్ద చోటుచేసుకుంది. బోదనంపాడు గ్రామంలో దశదినకర్మకు హాజరయ్యేందుకు దర్శిలోని సందువారిపాలెం మహిళలు 13 మంది ఆటోలో వస్తున్నారు. ఆ గ్రామ సమీపంలో ఆటో ముందు టైరు పగిలి రోడ్డు పక్కనే ఉన్న పతిలోకి జారి బోల్తా పడింది. ఈప్రమాదంలో ఆటోలో ఉన్న 13 మంది చెల్లాచెదురుగా పడిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే దర్శి సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. సందు అచ్చమ్మ, సందు విజయను మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తాండవ లక్ష్మమ్మను విజయవాడకు తరలించారు. వెంకటరమణను నరసరావుపేటకు తరలించారు. ఎవరికి ప్రాణాపాయంలేదని కుటుంబసభ్యులు తెలియజేస్తున్నారు. క్షతగాత్రులను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్‌లు వైద్యశాలలో పరామర్శించారు.ఎస్‌ఐ కోటయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.