ఆటో బోల్తా.. మహిళా కూలీ మృతి
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:55 PM
కూలీ పనులకు వెళ్తున్న క్రమంలో ఆటో బోల్తా పడటంతో మహిళా కూలీ దుర్మరణం చెందింది. ఈఘటన బుధవారం ఈపూరుపాలెం స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మృతురాలు కారంచేడు వాసి
చీరాల, జనవరి21 (ఆంధ్రజ్యోతి) : కూలీ పనులకు వెళ్తున్న క్రమంలో ఆటో బోల్తా పడటంతో మహిళా కూలీ దుర్మరణం చెందింది. ఈఘటన బుధవారం ఈపూరుపాలెం స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం... కారంచేడుకు చెందిన సుమారు 40 ఏళ్ల మహిళ మరో పదిమందితో కలిసి ఈపూరుపాలెంలో వ్యవసాయ కూలీ పనులకు వచ్చారు. ఈసమయంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడగా అందరికీ స్వల్ప గాయాలుకాగా, ఈమె మాత్రం తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరింది. దీంతో హుటాహుటిన చీరాల ఏరియా వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో శ్వాసవిడిచింది. ఆటో అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.