Share News

పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభంలో

ABN , Publish Date - May 19 , 2026 | 11:22 PM

రైతులకు విద్యుత్‌ సమస్యల నుంచి ఉపశమనం కల్పించి నాణ్యమైన విద్యుత్‌ అం దించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు.

పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభంలో
పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం, మే 19 (ఆంధ్రజ్యోతి) : రైతులకు విద్యుత్‌ సమస్యల నుంచి ఉపశమనం కల్పించి నాణ్యమైన విద్యుత్‌ అం దించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కంభం 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో నూతన 50 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ కంభం మండల పరిసర ప్రాంతాల రైతు లు, సామాన్యులు వ్యవసాయానికి విద్యుత్‌ కొరత ఉండడంతో సమస్యను విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా మరో 10సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు లే కుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుందని అశోక్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 11:22 PM