Share News

రోడ్డు ప్రమాద బాధితులకు భరోసా

ABN , Publish Date - Apr 19 , 2026 | 02:34 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 32 నెట్‌వర్క్‌ వైద్యశాలల్లో పీఎం రహత్‌ స్కీంను అమలు చేస్తున్నట్లు ఎన్‌టీఆర్‌ వైద్యసేవ సమన్వయకర్త డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్‌ అవర్‌లో ఉచి తంగా రూ.1.50లక్షల వరకు వైద్యం అందుతుందన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు భరోసా

పీఎం రహత్‌ పథకం కింద రూ.1.50లక్షల సాయం

ఉమ్మడి జిల్లాలో 32నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలు

క్లెయిమ్‌ చేసిన 15 రోజుల్లో నగదు చెల్లింపు

ఎన్‌టీఆర్‌ వైద్య సేవ సమన్వయకర్త హేమంత్‌ వెల్లడి

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 32 నెట్‌వర్క్‌ వైద్యశాలల్లో పీఎం రహత్‌ స్కీంను అమలు చేస్తున్నట్లు ఎన్‌టీఆర్‌ వైద్యసేవ సమన్వయకర్త డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్‌ అవర్‌లో ఉచి తంగా రూ.1.50లక్షల వరకు వైద్యం అందుతుందన్నారు. ఆర్థిక పరిస్థితితో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని తెలిపారు. క్లెయిమ్‌ చేసిన 15 రోజుల్లోనే హాస్పిటల్స్‌కు ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి సమాచారం అందించిన మొదటి వ్యక్తికి రహవీర్‌గా గుర్తించి రూ.25వేలు నగదు కూడా బహుమతిని కలెక్టర్‌ చేతుల మీదుగా అందిస్తామని హేమంత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 02:34 AM