Share News

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Apr 05 , 2026 | 02:27 AM

రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో కేంద్రాలను ప్రారంభిం చేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రబీ సీజన్‌లో ప్రకాశం జిల్లాలో 69,079 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి

రబీ సీజన్‌లో 2.35 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం

41 కేంద్రాల ఏర్పాటు

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో కేంద్రాలను ప్రారంభిం చేందుకు పౌరసరఫరాల సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రబీ సీజన్‌లో ప్రకాశం జిల్లాలో 69,079 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. మొత్తం 233 రైతు సేవా కేంద్రాల పరిధిలో 41 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆర్‌ఎస్‌కేల పరిధిలో ఈ-క్రాప్‌ నమోదు చేసుకున్న రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించనున్నారు. మద్దతు ధర విషయానికి వస్తే గ్రేడ్‌-ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకం రూ.2,369 చెల్లించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగులను కూడా సిద్ధం చేశారు. రైతుల వద్ద సేకరించిన ధాన్యానికి గంటలలోపే వారి ఖాతాల్లో డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. తేమశాతం, తూకాల్లో తేడాలు రాకుండా చర్యలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ఆయా రైతు సేవా కేంద్రాల వారీగా ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - Apr 05 , 2026 | 02:27 AM