అర్జీలను వేగంగా పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:38 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేలా దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ చిన ఓబులేశు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీ కోసం హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేలా దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ చిన ఓబులేశు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మీ కోసం హాలులో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా చిన ఓబులేశు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించేలా చూడాలన్నారు.
జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో అశతో అర్జీదారులు వస్తారని, వచ్చిన అర్జీలను పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 329 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు కుమార్, కళావతి, విజయజ్యోతి, మాధురిలు తదితరులు ఉన్నారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 93 ఫిర్యాదులు
పోలీసు గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి 93 ఫిర్యాదులు అందాయి. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళాపోలీసు స్టేషన్ డీఎస్పీ రమణకుమార్‌లతోపాటుగా పలువురు పోలీసు అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదిదారుల నుంచి అందిన వినతులను క్షుణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చట్టపరిధిలో సత్వరం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు మంగారావు, మల్లిఖార్జునరావు, దుర్గాప్రసాద్ ,ఎస్సై జనార్దనరావులు ఉన్నారు.