Share News

66 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:01 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 66 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఎస్‌కే ఆయేషాబేగం తెలిపారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని ఎక్సైజ్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

66 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

వచ్చేనెల 5న లాటరీ .. జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఆయేషాబేగం

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 66 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఎస్‌కే ఆయేషాబేగం తెలిపారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని ఎక్సైజ్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గురువారం నుంచి వచ్చేనెల 1 అర్ధరాత్రి 11.59 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు ఽఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించామన్నారు. ప్రకాశం జిల్లాలో 45, మార్కాపురం జిల్లాలో 21 మద్యం దుకాణాలకు దరఖాస్తులు కోరుతున్నామని చెప్పారు. వచ్చేనెల 3న పరిశీలన, అనంతరం 5న లాటరీ నిర్వహించి షాపులను కేటాయిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్కిళ్ల వారీగా ఒంగోలులో 18, చీమకుర్తిలో 7, సింగరాయకొండలో 1, దర్శిలో 6, అద్దంకిలో 6, కందుకూరులో 7, పొదిలిలో 4, మార్కాపురంలో 1, కనిగిరిలో 6, గిద్దలూరులో 7, కంభంలో 3 దుకాణాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 25 , 2026 | 03:01 AM