18లోపు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలి
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:16 PM
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన టీచర్లు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీరేణుక మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.
ఒంగోలు విద్య, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన టీచర్లు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీరేణుక మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలోని ప్రభుత్వ, జడ్పీ, మండలపరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, కేజీబీవీలు, డైట్ కళాశాల, ఏపీ గురుకుల యాజమాన్యాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారు అర్హులని వివరించారు. ఎటువంటి నేర ఆరోపణలలు, శాఖాపరమైన అభియోగాలు, సివిల్, క్రిమినల్ కేసులు లేనివని సంబంధిత ధ్రువీకరణ పత్రాలను జతచేయాలని తెలిపారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈనెల 18వ తేదీలోపు మండల విద్యాధికారులకు దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు. ఎంఈవోలు ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైవి ఈనెల 20న సంబంధిత ఉపవిధ్యాదికారికి అందజేయాలని, వాటిని ఉప విద్యాధికారులు పరిశీలించి ఈనెల 22న డీఈవో కార్యాలయానికి పంపించాలని రేణుక తెలిపారు.