Share News

డీపీవోగా అనుపమ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:09 AM

జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా ఎం.అనుపమ బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఏలూరులోని డ్వామాలో డీవీవోగా పనిచేస్తున్న అనుపమను ఈనెల 16న ఇక్కడ డీపీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే.

డీపీవోగా అనుపమ బాధ్యతల స్వీకరణ

పలువురు ఉద్యోగుల శుభాకాంక్షలు

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా ఎం.అనుపమ బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఏలూరులోని డ్వామాలో డీవీవోగా పనిచేస్తున్న అనుపమను ఈనెల 16న ఇక్కడ డీపీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. ముందుగా ఆమె అద్దంకి మండలం సింగరకొండలో పూజలు చేశారు. అనంతరం ఒంగోలుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనుపమకు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు, ఉద్యోగులతోపాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఒంగో లు డివిజనల్‌ పంచాయతీ అధికారి పద్మతోపాటు ఆ కార్యాల య ఏవో శివారెడ్డి, ఇతర ఉద్యోగులు కలిశారు.

Updated Date - Jun 25 , 2026 | 03:09 AM