‘తల్లికి వందనం’కు మరో అవకాశం
ABN , Publish Date - Aug 05 , 2026 | 02:55 AM
తల్లికి వందనం పథకంలో అర్హులై సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లబ్ధిదారుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువును ఈనెల 7వతేదీ వరకు పొడిగించింది.
ఈనెల 7వరకు వినతుల స్వీకరణ
ఒంగోలు విద్య, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : తల్లికి వందనం పథకంలో అర్హులై సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. లబ్ధిదారుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ గడువును ఈనెల 7వతేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శించారు. అర్హులు ఉంటే అందుకు అవసరమైన సమాచారంతో వినతుల సమర్పణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆవిధంగా ఆయా కార్యాలయాలకు వచ్చిన వినతులను పరిశీలించి కొత్తగా అర్హులను గుర్తించి జాబితా తయారు చేస్తారు. ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించినందున తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.