టీచర్లకు మరో అవకాశం
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:28 AM
ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ (టిస్)లో టీచర్ల వివరాల్లోని తప్పుల సవరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 10 వరకూ గడువు ఇచ్చింది. ఈమేరకు పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు.
10 వరకు టిస్‌లో సవరణలు
క్రమశిక్షణ కేసులు త్వర లో పరిష్కారం
ఒంగోలు విద్య, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ (టిస్)లో టీచర్ల వివరాల్లోని తప్పుల సవరణకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 10 వరకూ గడువు ఇచ్చింది. ఈమేరకు పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. టిస్‌లోని వివరాల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే టీచర్ల సీనియారిటీ జాబితాలను తయారు చేసి విడుదల చేస్తారు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగో న్నతులు, రేషన్‌లైజేషన్ ప్రక్రియలన్నీ ఈ జాబితా ఆధారంగానే నిర్వహిస్తారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ రూపొందించి ప్రకటించిన టీచర్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు వెల్లువెత్తు తున్నాయి. దీంతో పొరపాట్లను గుర్తించిన పాఠశాల విద్యాశాఖ టిస్‌లో తప్పుల సవరణకు మరో అవకాశం ఇచ్చింది. ఈసారి టిస్‌లో తప్పులు దొర్లితే టీచర్లను బాధ్యులుగా చేయనున్నారు. టిస్‌కు సంబంధించిన వివరాలు ఉపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసుకొని వివరాలన్నింటినీ ఒకసారి పరిశీలించాలి. ఏదైనా తప్పు దొర్లి ఉంటే డీఈవో కార్యాలయంలో సంప్రదించి సరిచేయించుకోవాలి. టిస్‌లో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లుు ధ్రువీకరించుకున్నా వాటిని డౌన్‌లోడ్ చేసుకొని దానిపై సంబంధిత టీచర్ ధ్రువీకరణ సంతకం చేసి మండల విద్యాఽధికారి కార్యాలయంలో సమర్పించాలి. ఆ తర్వాత వివరాల్లో తేడాలు ఉన్నట్లు తేలితే సంబంధిత టీచర్లపై చర్యలు తీసుకుంటారు.
క్రమశిక్షణ కేసులు త్వరలో పరిష్కారం
ఉపాధ్యాయులపై పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ కేసులకు సంబంధించి త్వరలో పరిష్కారం లభిస్తుందని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. ఆ కేసులను ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉంచబోమన్నారు. వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకొని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించారు. తమ స్థాయిలో పరిష్కారం లభించే టీచర్ల సమస్యలన్నింటినీ సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.