Share News

మరో అవకాశం

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:26 PM

జిల్లాలో రేషన్‌ కార్డుకు మొబైల్‌ నెంబరును అనుసంధానం చేసుకొనేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 15 వరకూ గడువు ఇచ్చింది.

మరో అవకాశం

రేషన్‌ కార్డులకు మొబైల్‌ నెంబర్‌ అనుసంధానానికి 15 వరకూ గడువు

జిల్లాలో 2 లక్షలకుపైగా కార్డుదారులు పెండింగ్‌

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రేషన్‌ కార్డుకు మొబైల్‌ నెంబరును అనుసంధానం చేసుకొనేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈనెల 15 వరకూ గడువు ఇచ్చింది. కుటుంబ పెద్ద ఆధార్‌ కార్డుకు ఏ మొబైల్‌ నెంబరు లింక్‌ అయిందో దాన్నే రేషన్‌ కార్డుకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్‌ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత కోసం అనేక మార్పులు తీసుకొచ్చింది. అందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. జిల్లాలో 1,045 రేషన్‌షాపుల పరిధిలో 6,16,806 మంది కార్డుదారులు ఉన్నారు. వారిలో సుమారు 4 లక్షల మంది తమ మొబైల్‌ నెంబర్‌ను లింక్‌ చేయించుకున్నారు. 2 లక్షల మంది పెండింగ్‌లో ఉన్నారు. వీరికీ ప్రభుత్వం అవకాశం కల్పించింది.

Updated Date - Oct 04 , 2026 | 11:26 PM