పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటన
ABN , Publish Date - Sep 20 , 2026 | 03:02 AM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 14వతేదీన ముసా యిదా జాబితాను ప్రకటించారు.
373 ఎంపీటీసీ స్థానాలకు 1,353 పోలింగ్ బూత్‌లు
1,100 ఓట్లకు ఒక పోలింగ్ సెంటర్ ఉండేలా చర్యలు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 14వతేదీన ముసా యిదా జాబితాను ప్రకటించారు. అనంతరం జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించారు. శనివారం జిల్లాలో 373 ఎంపీటీసీ స్థానాలకు 1,353 పోలింగ్ కేంద్రాలను జిల్లా పరిషత్ సీఈవో బి.చిరంజీవి ప్రకటించారు. వాటిని జడ్పీ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రచురించారు. 1,100 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాలను ప్రకటించారు.