Share News

నేడు టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ప్రకటన

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:13 AM

కందుకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ చైర్మన్‌ అభ్యర్థిత్వం కోసం అనేకమంది పోటీపడ్డారు.. వారిలో తుదకు నలుగురిని ఎంపిక చేశాం.. ఆ నలుగురిలో ఒకరిని అభ్యర్థిగా శనివారం సాయంత్రంలోపు పార్టీ అధిష్టానం ప్రకటిస్తుంది.. అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా అందరూ సమష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేసేందుకు అంగీకరించారని ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి తెలిపారు.

నేడు టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి ప్రకటన
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఇంటూరి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, పక్కన పిడికిటి, దివి సౌభాగ్య, కండ్రా, ఉప్పుటూరి, మాజీఎమ్మెల్యే దివి శివరాం

నలుగురు ఔత్సాహికులలో ఒకరిని అధిష్టానం ప్రకటి ంచే అవకాశం

ఎన్నికల పరిశీలకుడు రాంగోపాల్‌ రెడ్డి

టికెట్‌ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం

ఔత్సాహిక అభ్యర్థులు

జనసేన, బీజేపీలకు రెండేసి వార్డులు కేటాయింపు

కందుకూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కందుకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ చైర్మన్‌ అభ్యర్థిత్వం కోసం అనేకమంది పోటీపడ్డారు.. వారిలో తుదకు నలుగురిని ఎంపిక చేశాం.. ఆ నలుగురిలో ఒకరిని అభ్యర్థిగా శనివారం సాయంత్రంలోపు పార్టీ అధిష్టానం ప్రకటిస్తుంది.. అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా అందరూ సమష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేసేందుకు అంగీకరించారని ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. కందుకూరు మున్సిపాలిటీకి 14 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటం, చైర్మన్‌ పదవిని జనరల్‌ కేటగిరీకి రిజర్వ్‌ కావటంతో పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న అనేకమంది నాయకులు పోటీపడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఔత్సాహిక అభ్యర్థులతో ఉమ్మడిగాను, ఆ తర్వాత విడివిడిగా ఔత్సాహికుల ఇఽళ్లకు వెళ్లి ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావులు చర్చలు జరిపారు. చైర్మన్‌ అభ్యర్థిత్వం కోసం పోటీలో ఉన్న ఉప్పుటూరి శ్రీనివాసరావు, దివి సౌభాగ్య, పిడికిటి వెంకటేశ్వర్లు, కండ్రా మాల్యాద్రిలతో పాటు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంతో కలిసి స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నలుగురు అభ్యర్థుల విషయంలో ప్రజాభిప్రాయం కోసం ఐవీఆర్‌ఎస్‌ సర్వే పలు దఫాలు నిర్వహించటంతో పాటు పార్టీ అంతర్గత యంత్రాంగం ద్వారా అధిష్టానం నివేదికలు తెప్పించుకుని పరిశీలన చేస్తున్నదని అన్ని అంశాలను బేరీజు వేసుకుని ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పోటీలో ఉన్న నలుగురు దశాబ్ధాలుగా కందుకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న వారేనని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ నలుగురు తన విజయం కోసం శక్తి వంచన లేకుండా పనిచేశారని తెలిపారు. వీరిలో ఎవరిని అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించినా సమష్టిగా అందరు కలిసికట్టుగా పార్టీ ఘనవిజయం సాధించేలా పనిచేస్తామని తెలిపారు.


వైస్‌ ఛైర్మన్‌గా ముస్లింలు, ఆర్యవైశ్యులు

మున్సిపాలిటీ ఛైర్మన్‌ పదవి జనరల్‌ కేటగిరికి రిజర్వ్‌ అయినందున వైస్‌ చైర్మన్‌ పదవిని తొలి రెండున్నరేళ్లు ముస్లింలకు, తరువాత రెండున్నరేళ్లు ఆర్యవైశ్యులకు కేటాయించాలని నిర్ణయించామని ఎమ్మెల్యే ఇంటూరి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి తెలిపారు. ముస్లింలు, ఆర్యవైశ్యులు టీడీపీ అభ్యర్థుల విజయం కోసం సమిష్టిగా పనిచేయాలని తెలిపారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు రెండు వార్డులు, బీజేపీకి రెండు వార్డులు కేటాయించామని మిగిలిన 36 వార్డులలో తెలుగుదేశం అభ్యర్థులు కౌన్సిలర్లుగా పోటీచేస్తారని తెలిపారు. సమావేశంలో బీసీ నాయకుడు అప్పనబోయిన నరసింహ్మం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 12:14 AM