Share News

మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ABN , Publish Date - May 27 , 2026 | 03:10 AM

మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. బక్రీదు పండుగ సందర్భంగా ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మూగజీవాల అక్రమ రవాణా, వధలపై నిఘాను ఉంచామన్నారు.

మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం

ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడి

ఒంగోలు క్రైం, మే 26 (ఆంధ్రజ్యోతి) : మూగజీవాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. బక్రీదు పండుగ సందర్భంగా ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మూగజీవాల అక్రమ రవాణా, వధలపై నిఘాను ఉంచామన్నారు. రెండు జిల్లాల్లో పశుసంవర్థక, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో 53 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాస్థాయిలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ పి.శ్రీధర్‌ను నోడల్‌ అధికారిగా నియమించామన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టులు, టోల్‌గేట్స్‌, ప్రధాన రహదారుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గోవులను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే జేఏసీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటారన్నారు. ఏదైనా సమాచారం ఉంటే పోలీసు కంట్రోల్‌ రూం వాట్సాప్‌ నంబర్లు 9121102266, 9121102242, నోడల్‌ ఆఫీసర్‌ 9121102116 లేదా 112, 100కు కాల్‌ చేయాలని కోరారు.

Updated Date - May 27 , 2026 | 03:10 AM