హోంమంత్రికి ‘అంబటి’ క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:49 PM
వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేసింది.
ఎమ్మార్పీఎస్ డిమాండ్
ఒంగోలు కార్పొరేషన్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఒంగోలులో స్థానిక అంబేడ్కర్ భవనం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్రబాబు మాట్లాడుతూ మహిళా మంత్రిపై అంబటి రాంబాబు అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని ఎంఎ్‌సపీఎస్, ఎమ్మార్పీఎస్ ఖండిస్తుందని తెలిపారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భావించి, తాము ఆందోళనకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్ మాట్లాడుతూ మహిళల పట్ల, మహిళ నాయకులు పట్ల అంబటి రాంబాబు మొదటి నుంచి అగౌరవంగానే మాట్లాడేవారన్నారు. హోంమంత్రి అనితపై అనుచితంగా అసభ్యర వాఖ్యలు చేయడాన్ని తాము తప్పు పడుతున్నామన్నామని తెలిపారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతో జిల్లావ్యాప్తంగా అందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంఎ్‌సపీ జాతీయ ఉపాధ్యక్షుడు జాలిజగి నరసింహ, జిల్లా అధ్యక్షుడు తొరటి ఆనంద్, నియోజకవర్గ ఇన్‌చార్జి తిరువీధి బాబు, నాయకులు పాల్గొన్నారు.