Share News

సమగ్ర ప్రణాళికతోనే అద్భుత ఫలితాలు

ABN , Publish Date - May 03 , 2026 | 02:17 AM

సమగ్ర ప్రణాళిక, నిరంతర సాధనతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని కలెక్టర్‌ రాజాబాబు పేర్కొన్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులే అందుకు నిదర్శనమన్నారు.

సమగ్ర ప్రణాళికతోనే అద్భుత ఫలితాలు
బహుమతి, జ్ఞాపికను అందుకున్న విద్యార్థులతో కలెక్టర్‌ రాజాబాబు, వివిధ శాఖల అధికారులు

టెన్త్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సత్తా

590కిపైగా మార్కులు వచ్చిన వారికి రూ.2వేల చొప్పున ప్రోత్సాహక బహుమతి

కలెక్టర్‌ రాజాబాబు రూ.లక్ష సహాయం

ఒంగోలు కలెక్టరేట్‌, మే 2 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర ప్రణాళిక, నిరంతర సాధనతో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని కలెక్టర్‌ రాజాబాబు పేర్కొన్నారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులే అందుకు నిదర్శనమన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, వివిధ శాఖల వసతి గృహాల్లో చదువుతూ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలులోని మీకోసం హాలులో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 590కిపైగా మార్కులు సాధించిన 13మంది, మండల స్థాయిలో టాపర్లుగా నిలిచిన 31 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున ప్రోత్సాహక బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అందుకోసం కలెక్టర్‌ వ్యక్తిగతంగా రూ.లక్ష సహాయం అందించారు. అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయడం ద్వారానే ఈసారి పది ఫలితాల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా నాల్గో స్థానంలో నిలిచిందన్నారు.

Updated Date - May 03 , 2026 | 02:17 AM