స్థానిక సమరంపై నేడు కూటమి భేటీ
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:11 AM
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరు ణంలో కూటమి పార్టీలు దూకుడు ప్రదర్శిస్తు న్నాయి. ఈ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల వలే ఐక్యంగా సాగాలని నిర్ణయించుకున్న ఆ పార్టీల రాష్ట్ర నేతలు తదనుగుణంగా జిల్లా ల్లోనూ ఎలాంటి విభేదాలు లేకుండా ముందు కెళ్లాలని సూచించారు.
ఇన్‌చార్జి మంత్రి ఆనం నేతృత్వంలో రెండు జిల్లాల కీలక నేతల సమావేశం
ఒంగోలు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరు ణంలో కూటమి పార్టీలు దూకుడు ప్రదర్శిస్తు న్నాయి. ఈ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల వలే ఐక్యంగా సాగాలని నిర్ణయించుకున్న ఆ పార్టీల రాష్ట్ర నేతలు తదనుగుణంగా జిల్లా ల్లోనూ ఎలాంటి విభేదాలు లేకుండా ముందు కెళ్లాలని సూచించారు. కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ ఆయా జిల్లాల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయ బాధ్యతను జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించింది. ఈనేప థ్యంలో ప్రస్తుతం ప్రకాశం, మార్కాపురం రెండు జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరి స్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ రెండు జిల్లాల కూటమి పార్టీల సంయుక్త సమావేశాన్ని శనివారం ఒంగోలులో ఏర్పాటు చేశారు. స్థానిక రామ్‌నగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాలయంలో ఇది జరగనుంది. టీడీపీ నుంచి జిల్లాకు చెందిన మంత్రులు, పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు ఇన్‌చార్జిలు, పార్టీ తరఫున స్థానిక ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ఇద్దరు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కూటమిలో ఇతర భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీల రెండు జిల్లాల నేతలు కూడా పాల్గొననున్నారు. తొలుత మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రధానంగా వాటిపై చర్చించనున్నట్లు సమాచారం. మూడు పార్టీల తరఫున రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి అనువైన అభ్యర్థులపై కూడా అంతర్గతంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.