పొదిలిలో కూటమి దూకుడు
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:37 AM
పొదిలి నగర పంచాయతీలో నామినేషన్ల ఘట్టం నుంచే కూటమి దూకుడును ప్రదర్శిస్తోంది. చైర్మన్‌తోపాటు వార్డుల అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేసుకోవడం, పట్టణంలోని ఆ పార్టీ ప్రముఖులైన పలువురిని వార్డుల్లో రంగంలో దింపడం విశేషం. చైర్మన్ అభ్యర్థి వరి కూటి అనిల్‌అలియాస్ పండు ముందస్తు వ్యూహంతో ఓటు బ్యాంకు ఉన్న వారిని కలుస్తున్నారు.
ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి
వార్డుల నుంచి పలువురు ప్రముఖులు పోటీ
వైసీపీలో మాత్రం కొనసాగుతున్న తికమక
చైర్మన్ అభ్యర్థి ఎంపికే పూర్తికాని వైనం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
పొదిలి నగర పంచాయతీలో నామినేషన్ల ఘట్టం నుంచే కూటమి దూకుడును ప్రదర్శిస్తోంది. చైర్మన్‌తోపాటు వార్డుల అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేసుకోవడం, పట్టణంలోని ఆ పార్టీ ప్రముఖులైన పలువురిని వార్డుల్లో రంగంలో దింపడం విశేషం. చైర్మన్ అభ్యర్థి వరి కూటి అనిల్‌అలియాస్ పండు ముందస్తు వ్యూహంతో ఓటు బ్యాంకు ఉన్న వారిని కలుస్తున్నారు. మరోవైపు వైసీపీ ఇప్పటికీ చైర్మన్ అభ్యర్థిని ఎంపిక చేసుకోలేక ఆపసోపాలు పడుతోంది. పొదిలి నగర పంచాయ తీకి పోటీలో ఉన్న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన మంగళవారం ము గిసింది. బుధవారం మధ్యాహ్నం వరకు ఉపసంహరణకు సమయం ఉంది. అయితే టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా పండు పేరును ముందుగానే ప్రకటించింది. 28 వార్డుల్లో రమారమి 25వార్డుల అభ్యర్థుల ఎంపికను పూర్తిచేశారు. ఎక్కువ మంది పోటీలో ఉన్న మూడు వార్డుల్లో అభ్యర్థులను బుధవారం ఖరారు చేసి మిగిలిన వారి నామినేషన్లు ఉపసంహరణ చేయనున్నారు. అదేసమయంలో వార్డుల నుంచి ఆ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పోటీలో దిగటం విశేషం.
రంగంలోకి టీడీపీ ప్రముఖులు
అన్నివర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు పండు అభ్యర్థి కావటం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇటు దళితులు, ఆర్యవైశ్య సామాజికవర్గ ప్రజలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు అధికంగానే ఉన్నాయి. ఇక టీడీపీకి సంబంధించిన ప్రముఖుల్లో జడ్పీటీసీ మాజీ సభ్యులు కాటూరి వెంకటనారాయణబాబు, వాణిజ్య విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సామంతపూడి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ కాటూరి నారాయణరావు సోదరి వెంకటరమణమ్మ మరో మాజీ సర్పంచ్ స్వర్ణగీత కుమారుడు, అలాగే జనసేన నుంచి మాజీ ఎంపీపీ విజయగౌరి సహచరులు వార్డుల్లో పోటీలో ఉన్నారు. అలాగే జనసేన, బీజేపీలతో సామరస్యంగా సీట్ల పంపిణీ జరిగి వారి వైపు నుంచి ముఖ్యులు రంగంలోకి వచ్చారు. దీంతో కూటమి అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి సఫలీకృతులయ్యారు. ప్రధాన బాధ్యత పూర్తి కావటంతో చైర్మన్ అభ్యర్థి పండు ఆయా ప్రాంతాల్లో ఓటు బ్యాంకర్లుగా ఉండే ప్రముఖులందరినీ కలిసి వారి మద్దతును సమీకరించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
కుస్తీపడుతున్న వైసీపీ ఇన్‌చార్జి
వైసీపీ విషయానికొస్తే చైర్మన్ అభ్యర్థి ఎంపికే ఇంతవరకు పూర్తికాలేదు. ఆ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో ఒకరిని ఎంపిక చేసే విషయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు కుస్తీ పడుతున్నారు. దీనికి తోడు సుమారు పది వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేయడంతో వారి మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు రాంబాబు నిమగ్నమయ్యారు. దీంతో కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోయేందుకు మార్గం సులభమైంది.