Share News

లింక్‌రోడ్లన్నీ తారు రోడ్లుగా అభివృద్ధి

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:01 PM

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలోనే గ్రామగ్రామాన లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తిచేశాం.. గ్రామాలకు అనుసంధానంగా ఉండే లింకురోడ్లన్నింటినీ తారురోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు.

లింక్‌రోడ్లన్నీ తారు రోడ్లుగా అభివృద్ధి
అనంతసాగరంలో తారురోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

కందుకూరు రూరల్‌ మండలంలో మూడురోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి

కందుకూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలోనే గ్రామగ్రామాన లక్షలాది రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తిచేశాం.. గ్రామాలకు అనుసంధానంగా ఉండే లింకురోడ్లన్నింటినీ తారురోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు. జరుగుతున్న అభివృద్ధిని చూస్తున్న ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పల్లెపండుగ 3.0లో భాగంగా కందుకూరు రూరల్‌ మండలంలోని ఓవీరోడ్డు-అనంతసాగరం, బలిజపాలెం-కమ్మవారిపాలెం, కందుకూరు-కొండికందుకూరు వయా కొష్టాల రోడ్లను రూ.4.14 కోట్లతో తారురోడ్లుగా చేపట్టనున్న నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ రాయపాటి సుభాషిణి శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ ఉప్పుటూరి శ్రీనివాసరావు, ఆయా గ్రామాల టీడీపీ నాయకులు భైరపనేని రమణయ్య, తోకల రామకృష్ణ, ఈదర నరసయ్య, మాదాల వెంకటేశ్వర్లు, భైరపనేని కోటయ్య, శ్రీకాంత్‌, రెబ్బవరపు మాల్యాద్రి, ఏకాంబరం నాగేశ్వరరావు, వెంకటరావు, అల్లం వెంకటేశ్వర్లు, పీఆర్‌ డీఈఈ మాలకొండయ్య పాల్గొన్నారు.


ఎస్టీలకు ఇళ్లస్థలాలు పంపిణీ

గుడ్లూరు మండలం తెట్టు ఎస్టీ కాలనీలో 40 మందికి నివాస స్థలాల పట్టాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వారి సమస్యను ప్రత్యక్షంగా చూసిన తాను ఎట్టి పరిస్థితుల్లో పట్టాలు సమకూరుస్తానని హామీ ఇచ్చానని, ఆ హామీ మేరకు నేడు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశానని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము ఈ పట్టాల కోసం ఎదురుచూస్తున్నామని తమ ఆకాంక్ష ఇన్నేళ్లకు నెరవేరిందని ఆనందం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టరు రాజామాథ్యూ, ఇన్‌చార్జి తహశీల్దార్‌ పి. మురళి, నాయకులు జనిగర్ల నాగరాజు, షేక్‌ పెదబాబు, పొట్టేళ్ల మురళి, యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, బుజ్జి పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:01 PM