అంతర్గత వీధులన్నీ సీసీ రోడ్లుగా మార్చాలి
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:27 AM
ప్రతి గ్రామంలో అంతర్గత వీధులన్నీ సీసీరోడ్లుగా మార్చాలని శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చెప్పారు. రాచర్లలో రూ.30.80లక్షలతో మంజూరైన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, సత్యవోలు గ్రామంలో రూ.43.60లక్షలతో మంజూరైన సచివాలయ భవనాన్ని, అనుములపల్లిలో రూ.10లక్షలు, రంగారెడ్డిపల్లెలో రూ.58లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
రాచర్ల, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రతి గ్రామంలో అంతర్గత వీధులన్నీ సీసీరోడ్లుగా మార్చాలని శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి చెప్పారు. రాచర్లలో రూ.30.80లక్షలతో మంజూరైన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని, సత్యవోలు గ్రామంలో రూ.43.60లక్షలతో మంజూరైన సచివాలయ భవనాన్ని, అనుములపల్లిలో రూ.10లక్షలు, రంగారెడ్డిపల్లెలో రూ.58లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సులభతరమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ప్రతి పంచాయతీలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసిందన్నారు. స్వర్ణగ్రామం, వార్డుల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని సేవలు స్వల్ప వ్యవధిలో అందించాలని అధికారులకు చెప్పారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని ఆయన కోరారు. తొలుత ఎమ్మెల్యేకు ఎంపీడీవో వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఎల్ వెంకటేశ్వర్లు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పంచాయతీ రాజ్ డీఈఈ సుబ్బారెడ్డి, అనుమలవీడు పీహెచ్‌సీ వైద్యాధికారి ఫణికిషోర్, డిప్యూటీ ఎంపీడీవోలు వెంకటేష్, ఓవిఎస్ కుమార్, పీడీవోలు అనిల్‌కుమార్, సురేష్, వెంకటేశ్వర్లు, సరస్వతి దేవి, సీహెచ్‌వో రామాంజనేయులు, కూట మి శ్రేణులు యోగానంద్, జీవనేశ్వరరెడ్డి, అంబవరం శ్రీనివాసరెడ్డి, కాశిరెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, ఎస్ వెంకటపతి, సంజయ్, ఎన్ శ్రీనివాసులు, దివాకర్, సయ్యద్‌మియా పాల్గొన్నారు.