Share News

రైల్వే స్టేషన్‌లలో సకల సౌకర్యాలు

ABN , Publish Date - Jul 18 , 2026 | 01:52 AM

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లలో అత్యాధునికమైన సకల సౌకర్యాలు అందుబా టులోకి వస్తున్నాయని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రధాని మోదీ కృషితో స్టేషన్‌లు కాంతులీనుతున్నాయని చెప్పారు. అమృత్‌ భారత్‌ కింద రూ.11.76కోట్లతో పునర్నిర్మించిన కంభం రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు.

రైల్వే స్టేషన్‌లలో సకల సౌకర్యాలు
మాట్లాడుతున్న ఎంపీ మాగుంట, వేదికపై ఎమ్మెల్యేలు ముత్తుముల, డాక్టర్‌ ఉగ్ర

అమృత్‌ భారత్‌తో అభివృద్ధి కాంతులు

ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి

పునర్నిర్మించిన కంభం రైల్వే స్టేషన్‌ను

వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ

స్థానికంగా ఎమ్మెల్యేలు ముత్తుముల, ఉగ్ర హాజరు

కంభం, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లలో అత్యాధునికమైన సకల సౌకర్యాలు అందుబా టులోకి వస్తున్నాయని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ప్రధాని మోదీ కృషితో స్టేషన్‌లు కాంతులీనుతున్నాయని చెప్పారు. అమృత్‌ భారత్‌ కింద రూ.11.76కోట్లతో పునర్నిర్మించిన కంభం రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కంభంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట పాల్గొని మాట్లాడారు. దేశంలోని 75 రైల్వే స్టేషన్‌ లను అన్ని సదుపాయాలతో ఆధునికీక రించారన్నారు. ప్రస్తుతం కంభం స్టేష న్‌లో లిఫ్ట్‌ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఏ ప్లాట్‌ఫాం మీదకైనా సులభతరంగా వెళ్లవచ్చన్నారు. దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంద న్నారు. కంభం రైల్వే స్టేషన్‌కు ఏడాదికి రూ.4.60కోట్లు, గిద్దలూరు రైల్వే స్టేషన్‌కు రూ.8కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మూడో లైన్‌ను నిర్మిస్తామని తెలిపారు. త్వరలో గిద్దలూరు రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్‌ భారత్‌లో భాగంగా ఆధునికీకరిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక కృషితో నడికుడి - శ్రీకాళహస్తి మార్గాన్ని నిర్మించారని తెలిపారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ మాగుంట కృషితో కంభం రైల్వేస్టేషన్‌ను ఇంత అద్భుతంగా ఆధునికీకరించారని తెలిపారు. కంభం - గిద్దలూరు స్టేషన్‌లలో కొన్ని రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. గరీభ్‌ రథ్‌ గిద్దలూరులో ఆగేలా చూడాలన్నారు. గుంతకల్లు నుంచి నంద్యాలకు వచ్చే ప్యాసింజర్‌ రైలును గిద్దలూరు వరకు పొడిగించాలని కోరారు. రైలు వచ్చి ఆగినప్పుడు ప్లాట్‌ఫాంలపై డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం తాను కంభం రైల్వేస్టేషన్‌కు వచ్చినప్పుడు అంతా చీకటిగా ఉండేదని తెలిపారు. ప్రస్తుతం అత్యంత సుందరంగా తీర్చిదిద్దారన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కోస్తా గుంటూరు డివిజన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సురేష్‌, డీసీఎం వినాయక్‌ తదితరులు ప్రసంగించారు. అనంతరం రైల్వే అధికారులు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యేలు షీల్డులు అందజేశారు.

Updated Date - Jul 18 , 2026 | 01:52 AM