Share News

పట్టణాభివృద్ధి కోసం హడ్కోతో ఒప్పందం

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:14 PM

నూతన జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన పట్టణ అభివృద్ధి కోసం హడ్కో సంస్థతో మార్కాపురం పురపాలక సంఘం ఆదివారం ఒప్పందం చేసుకుంది.

పట్టణాభివృద్ధి కోసం హడ్కోతో ఒప్పందం
మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పంద పత్రాలు అందుకుంటున్న కమిషనర్‌ నారాయణరావు

మార్కాపురం టౌన్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): నూతన జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన పట్టణ అభివృద్ధి కోసం హడ్కో సంస్థతో మార్కాపురం పురపాలక సంఘం ఆదివారం ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో జరుగుతున్న ప్రాంతీయ వర్క్‌షా్‌పలో పాల్గొన్న కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సమక్షంలో హడ్కో సంస్థ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల పెంపుదల కోసం స్థానిక సంస్థలకు హడ్కో సంస్థ చేదోడుగా ఉంటుందని కమిషనర్‌ నారాయణరావు తెలిపారు. మార్కాపురం పట్టణంలో వసతుల కల్పన కోసం కావాల్సిన రుణ సదుపాయాన్ని వీరి నుంచి పొందనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సూచనల మేరకు ఈ రుణ సహాయాన్ని ఉపయోగించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 15 , 2026 | 11:14 PM