పదోతరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాల
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:04 PM
పదోతరగతి పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని ప్రతి విద్యార్థి పాసవ్వాలని, వందశాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి స్వామి
ఉమ్మడి జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారులతో సమీక్ష
తూర్పునాయుడుపాలెం (కొండపి), మార్చి2 (ఆంధ్రజ్యోతి) : పదోతరగతి పరీక్షల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని ప్రతి విద్యార్థి పాసవ్వాలని, వందశాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సోషల్ వెల్ఫేర్ ఏఎ్‌సడబ్ల్యూవోలతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ వార్డెన్‌లు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని, వందశాతం ఉత్తీర్ణతకు అనుకూలంగా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా హాస్టల్స్‌లో మెనూ, పారిశుధ్య నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని ఆదేశించారు. హాస్టల్స్ నిర్వహణపై ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా తల్లితండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని, వందశాతం విద్యార్థుల తల్లితండ్రుల సంతృప్తి లక్ష్యంగా వార్డెన్‌లు పనిచేయాలని మంత్రి స్వామి సూచించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సాంఘిక సంక్షేమహాస్టల్స్‌లో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా శానిటేషన్ వర్కర్స్‌ను నియమిస్తున్నామని, అన్ని హాస్టల్స్‌లో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీఎం అజయ్ కింద రాష్ట్రంలో 26 నూతన హాస్టల్స్‌ను నిర్మిస్తున్నామని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వార్డెన్‌లు పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
యూపీఎస్సీ, సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ట్యాబ్‌ల పంపిణీ
రాష్ట్రంలోని పేదల పిల్లలు ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎ్‌సలు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ, సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న జిల్లాలోని ఎస్సీ అభ్యర్థులకు స్వామి ఉచితంగా ట్యాబ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ స్టడీ సర్కిల్స్‌ను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజాప్రభుత్వం విజయవాడ, విశాఖ, తిరుపతి కేంద్రాలుగా సివిల్స్‌కి ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రెసిడెన్షియల్ శిక్షణకు అర్హత సాధించలేని అభ్యర్థులకు ఉచితంగా ఆన్‌లైన్ శిక్షణను ప్రభుత్వం ఇస్తోందన్నారు. పీ-4 పఽథకం ద్వారా రాష్ట్రంలో పేదరికం లేని సమాజం సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి అన్నారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, అభ్యర్థులు ప్రభుత్వం ఇస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మంత్రి స్వామి సూచించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ జిల్లా డీడీ లక్ష్మానాయక్ పాల్గొన్నారు.