Share News

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

ABN , Publish Date - Jul 23 , 2026 | 03:06 AM

పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ ఒంగోలులోని జిల్లా పోక్సో కోర్టు బుధవా రం తీర్పునిచ్చింది. బాధిత బాలికకు ప్రకాశం జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్‌ఎస్‌) ద్వారా రూ.2 లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశించింది.

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

బాధితురాలికి రూ. 2లక్షల నష్టపరిహారం

కనిగిరి, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ ఒంగోలులోని జిల్లా పోక్సో కోర్టు బుధవా రం తీర్పునిచ్చింది. బాధిత బాలికకు ప్రకాశం జిల్లా న్యాయ సేవా సంస్థ (డీఎల్‌ఎస్‌) ద్వారా రూ.2 లక్షల నష్టపరిహారం అందించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. కనిగిరి నియో జకవర్గం హెచ్‌ఎంపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన గురునాథం డానియేలు వరుసకు కూతురైన బాలికపై 2023 అక్టోబర్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. హెచ్‌ఎంపాడు పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమో దైంది. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు, నిందితుడి అరెస్ట్‌, ట్రయల్‌ నిర్వహణలో సమ ర్ధంగా పనిచేసిన అప్పటి డీఎస్పీ రామరాజు, ఎస్‌ఐ శివనాగ రాజు, ప్రస్తుత ఎస్‌ఐ రాజ్‌కుమార్‌, కోర్టు లైజన్‌ సిబ్బంది, పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించారు.

Updated Date - Jul 23 , 2026 | 03:06 AM