Share News

బాలిక హత్య కేసులో నిందితురాలి అరెస్ట్‌

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:04 PM

త్రిపురాంతకం మండల కేంద్రంలో ఈ నెల 26న కన్న తండ్రే కాలయముడై కన్న కూతురిని హత్య చేసిన విషయం తెలిసిందే.

 బాలిక హత్య కేసులో నిందితురాలి అరెస్ట్‌
హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు

కేసు వివరాలను వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ

ఎర్రగొండపాలెం రూరల్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): త్రిపురాంతకం మండల కేంద్రంలో ఈ నెల 26న కన్న తండ్రే కాలయముడై కన్న కూతురిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ హత్యకు సంబంధించి రెండవ నిందితులుగా బాజీబీని ఆదివారం త్రిపురాంతకం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మార్కాపరం డీఎస్పీ యూ నాగరాజు పోలీస్‌ స్టేషన్‌ల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వివాహేతర సంబంధం ఎక్కడ కూతురు బయట పెడుతుందోనని భావించిన కన్న తండ్రి మోటకట్ల శివారెడ్డి కన్న కుమార్తె తులసివందన (9)ను ప్రియరాలి ఇంట్లోకి తీసుకెళ్లి నోట్లో గుడ్డ కుక్కి, చార్జింగ్‌ వైర్‌ను మెడకు చుట్టి, రొకలి బండతో కొట్టి కిరాతకంగా హత్య చేశారని తెలిపారు. ఈ హత్యకు సహకరించిన శివారెడ్డి ప్రియురాలు షేక్‌ బాజీబీని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మొదటి నిందితుడు శివారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసును తక్కువ సమయంలో ఛేదించిన సీఐ అస్సాన్‌, ఎస్‌ఐ శివరామయ్య, సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 11:04 PM