Share News

ఒంగోలు కార్పొరేషన్‌పై ఏసీబీ దాడులు

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:11 AM

ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌పై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. మంగళ వారం రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్‌ కార్యాలయాల తనిఖీలలో భాగంగా ఇక్కడ కూడా నిర్వహిం చారు. ఏసీబీ సీఐలు రమేష్‌, శేషు తన సిబ్బం దితో రావడంతో కార్పొరేషన్‌ ఉద్యోగులంతా ఉలికిపాటుకు గురయ్యారు.

ఒంగోలు కార్పొరేషన్‌పై ఏసీబీ దాడులు

టౌన్‌ ప్లానింగ్‌లో రూ.25వేలు స్వాధీనం

ఫోన్‌పే లావాదేవీలపై ఆరా

రాత్రి వరకు కొనసాగుతున్న తనిఖీలు

ఒంగోలు క్రైం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌పై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. మంగళ వారం రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్‌ కార్యాలయాల తనిఖీలలో భాగంగా ఇక్కడ కూడా నిర్వహిం చారు. ఏసీబీ సీఐలు రమేష్‌, శేషు తన సిబ్బం దితో రావడంతో కార్పొరేషన్‌ ఉద్యోగులంతా ఉలికిపాటుకు గురయ్యారు. ఆ సందర్భంగా కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది నుంచి సుమారు రూ.25వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు ఈనెల 12 వరకు, అక్రమ లేఅవుట్ల రెగ్యులరైజ్‌కు ఈనెల 21 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. దీంతో జోరుగా అవినీతి వ్యవహారాలు సాగుతున్నాయన్న ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ అటెండర్‌ వద్ద రూ.6,500, ఎల్‌టీపీ వద్ద రూ.6,100, ఇతరుల వద్ద మరికొంత నగదు దొరి కింది. అయితే కార్యాలయంలో అంతా ఆన్‌లైన్‌ లావాదేవీలు కావడంతో సిబ్బంది నగదును ఎక్కడా రిజిస్టర్‌లో నమోదు చేయలేదు.

ఫోన్‌పే లావాదేవీలపై విచారణ

టౌన్‌ ప్లానింగ్‌లో ఇన్‌చార్జి ఏసీపీ బాబూరావు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఫోన్‌లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి ఫోన్‌ పే లావాదేవీలపై విచారణ చేపట్టారు. ఎక్కువ మొత్తంలో జరిగిన నగదు బదిలీలపై ఆరా తీస్తున్నారు. అవసరమైతే నగదు పంపిన వారిని పిలిపించి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ పనిచేస్తున్న ఓ అటెండర్‌ వ్యవహారాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ అధికారులు టౌన్‌ప్లానింగ్‌లో రికార్డులను పరిశీలన చేస్తూనే ఉన్నారు. దీంతోపాటు ప్రైవేటు ప్లానింగ్‌ కంపెనీల యజమానులతో టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు ఉన్న లావీదేవీలు ఏమిటి అని వారిని ప్రత్యక్షంగా పిలిపించి అడిగి తెలుసుకుంటున్నారు. అక్రమ కట్టడాలు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా? అన్న కోణంలో కూడా రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఈ తనిఖీలపై అధికారికంగా మాట్లాడలేదు.

Updated Date - Mar 11 , 2026 | 03:11 AM