Share News

బలరామకృష్ణాపురంలో యువకుడికి డెంగ్యూ

ABN , Publish Date - Mar 24 , 2026 | 11:50 PM

అద్దంకి మండల పరిధిలోని ధేనువకొండ పునరావాసకాలనీకి చెందిన పాలపర్తి సుధాకర్‌ డెంగ్యూతో ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.

బలరామకృష్ణాపురంలో యువకుడికి డెంగ్యూ
గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎంవో డాక్టర్‌ మధుసూదన్‌రావు

గ్రామంలో పర్యటించి వివరాలు తెలుసుకున్న డీఎంవో

ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి సర్వే

అద్దంకిటౌన్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని ధేనువకొండ పునరావాసకాలనీకి చెందిన పాలపర్తి సుధాకర్‌ డెంగ్యూతో ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు డెంగ్యూ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ మధుసూదనరావు మంగళవారం పునరావాసకాలనీ(బలరామకృష్ణాపురం)లో పర్యటించారు. సుధాకర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితుడు ఈనెల 10న లివర్‌ సమస్యతో అద్దంకి, అనంతరం ఒంగోలులోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందాడు. మూడు రోజుల క్రితం ఒంగోలు రిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆరోగ్య సిబ్బందికి డీఎంవో సూచించారు. నీటి నిల్వలు వంటివి లేకుండా చూడాలని, గ్రామంలో ఫాగింగ్‌ నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట అద్దంకి సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ అర్జున్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నాగినేని రామకృష్ణ, ఎంపీహెచ్‌ఈవో పి.బ్రహ్మనందం, హెచ్‌వీ తబిత, ఏఎన్‌ఎంలు శేషమ్మ, భారతీ, సుఽధా, రాజేశ్వరి, మహలక్ష్మి, ఆశా కార్యకర్త దుర్గ తదితరులు ఉన్నారు. డీఎంవో ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. జ్వరాల వివరాలతో పాటు నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలియజేశారు.

Updated Date - Mar 24 , 2026 | 11:50 PM