Share News

అమరజీవికి ఘన నివాళి

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:05 AM

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం జిల్లాలో ఘనంగా జరిగాయి. పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు అనేక గ్రామాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకవైపు ప్రభుత్వం తరఫున అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో, మరోవైపు వివిధ రాజకీయ పక్షాలు, ప్రత్యేకించి ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.

అమరజీవికి ఘన నివాళి
ఒంగోలులో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి స్వామి, ఎ మ్మెల్యే జనార్దన్‌, కలెక్టర్‌ రాజాబాబు, ఒడా చైర్మన్‌ రియాజ్‌ తదితరులు

ఊరురా విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు

ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమరావతిలో

విగ్రహావిష్కరణ కార్యక్రమ వీక్షణ

ఒంగోలు, సింగరాయకొండల్లో పాల్గొన్న

మంత్రి స్వామి, పలుచోట్ల ఎమ్మెల్యేలు హాజరు

ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలోనూ కార్యక్రమాలు

ఒంగోలు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు సోమవారం జిల్లాలో ఘనంగా జరిగాయి. పట్టణాలు, మండల కేంద్రాలతోపాటు అనేక గ్రామాల్లో పొట్టి శ్రీరాములు విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకవైపు ప్రభుత్వం తరఫున అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో, మరోవైపు వివిధ రాజకీయ పక్షాలు, ప్రత్యేకించి ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. వివిధస్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతోపాటు ఇతర రాజకీయ, వ్యాపార ప్రము ఖులు పాల్గొన్నారు. రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. అమరజీవికి గుర్తుగా అమరావతిలో ఏర్పాటుచేసిన 58 అడుగుల ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం ఆవిష్కరించారు. ఆ కర్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వీక్షించారు. ఒంగోలులోని సీవీఎన్‌ రీడింగ్‌ రూం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కలెక్టర్‌ రాజాబాబు ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సింగరాయకొండలో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటుచేసిన అమరావతిలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కలెక్టర్‌ రాజాబాబు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ చీమకుర్తిలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అమరజీవి విగ్రహానికి నివాళులర్పించి మునిసిపల్‌ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.

Updated Date - Mar 17 , 2026 | 03:05 AM