Share News

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:21 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన మంగళవారం బోయలపల్లి గ్రామ సమీప మూలమలుపు వద్ద జాతీయ రహదారిపై జరిగింది.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

ఎర్రగొండపాలెం రూరల్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : గుర్తు తెలియని వాహనం ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన మంగళవారం బోయలపల్లి గ్రామ సమీప మూలమలుపు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాకినాడ జిల్లా తునికి చెందిన డీ అభినవ్‌ (23) కందుకూరులోని ఏబీఆర్‌ ఇంజనీరింగ్‌ కాళాశాలలో సీఎస్సీ చదువుతున్నాడు. మధ్యాహ్నం కాళాశాలలోని పరీక్ష రాసి మాచర్ల వైపు బైక్‌పై బయలుదేరాడు. మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అభినవ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చెరుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 24 , 2026 | 11:21 PM