Share News

అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

ABN , Publish Date - Mar 29 , 2026 | 02:33 AM

మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

మార్కాపురం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయసునీత

బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

మార్కాపురం కలెక్టరేట్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని కలెక్టర్‌ ఎం.విజయసునీత తెలిపారు. శనివారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టిసారిస్తానని చెప్పారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతానన్నారు. మార్కాపురం తొలి కలెక్టర్‌గా మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టరేట్‌లోని చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన విజయసునీతను జేసీ శ్రీనివాసులు కలిసి బొకేను అందజేశారు. అనంతరం నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ఆమె పరిశీలించారు. గనులశాఖ ఏడీ రవికుమార్‌, డీఎంహెచ్‌వో వాణిశ్రీ, మైక్రో ఇరిగేషన్‌ పీడీ జెన్నెమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్‌, డీడీవో బాలునాయక్‌, అధికారులు కలెక్టర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 02:33 AM