అధ్వాన రోడ్లకు మోక్షం
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:46 AM
గుంతలమయమైన ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.57కోట్లకుపైనే నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఆయా రోడ్ల మరమ్మతులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి.
ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో ప్యాచ్ వర్కులకు ఎట్టకేలకు నిధులు
పాత ఉమ్మడి జిల్లాకు రూ.57.16 కోట్లు మంజూరు
త్వరలో టెండర్లు పిలిచేందుకు అధికారుల చర్యలు
గిద్దలూరు నియోజకవర్గంలోని 26రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.62కోట్లు మంజూరు చేసింది. ఇందులో గిద్దలూరు-ఉయ్యాలవాడ, బసినేపల్లి-పి.వెంకటాపురం రోడ్లకు రూ.2.20 కోట్లు కేటాయించింది. కంభం- పాపినేనిపల్లి రోడ్డుకు రూ.35 లక్షలు, కంభం చెరువు రోడ్డుకు రూ.5లక్షలు, యర్రబాలెం-మొహిద్దీన్‌పురం రోడ్డుకు రూ.12లక్షలు, కంభం-బోడిచెర్ల రోడ్డుకు రూ.20లక్షలు, నాగులవరం-వెలగలపాయ రోడ్డుకు రూ.19లక్షలు, పాపినేనిపల్లి-అచ్చంపేట రోడ్డుకు రూ.12లక్షలు మంజూరయ్యాయి.
దర్శి నియోజకవర్గంలోని ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధికి రూ.8.58 కోట్లు మంజూరయ్యాయి. అందులో సామంతపుడి-బొద్దికూరపాడు రోడ్డుకు రూ.3కోట్లు, రాజంపల్లి- తూర్పుగంగవరానికి రూ.40 లక్షలు, గజ్జలకొండ రోడ్డుకు రూ.40లక్షలు, కురిచేడు-ఆవులమందకు రూ.50లక్షలు కేటాయించారు. తాళ్లూరు-వెల్లంపల్లి రోడ్డుకు రూ.50లక్షలు, దర్శి అద్దంకి రోడ్డు నుంచి మొహిద్దీ న్‌పురానికి రూ.30లక్షలు, పలు ఇతర రోడ్లకు నిధులు విడుదలయ్యాయి.
గుంతలమయమైన ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.57కోట్లకుపైనే నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఆయా రోడ్ల మరమ్మతులు త్వరలోనే ప్రారంభంకానున్నాయి. నిధులు మంజూరు కావడంతో వాహనచోదకుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఒంగోలు కార్పొరేషన్, మార్చి6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని అధ్వాన రోడ్లకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. గతంలో ప్రతి రోడ్డులో అడుగుకో గుంత, అవస్థల ప్రయాణం కాగా ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక ప్రధాన రహదా రులు, కనెక్టివిటీ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారిం చింది. గడిచిన ఐదేళ్లలో అసలు పట్టించుకోని రోడ్లను బాగుచేయడంతోపాటు పూర్తిగా దెబ్బతిన్న వాటిని అభివృద్ధి చేస్తోంది. ఈమేరకు ప్రస్తుత ప్రకాశం జిల్లాతోపాటు పాత ఉమ్మడి జిల్లాకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. రూ.57.16 కోట్లు కేటాయించింది. అందుకు అనుగుణంగా రోడ్లు, భవనాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించారు. దీంతో త్వరలోనే జిల్లాలోని రహదారులకు మోక్షం లభించనుంది.
పాడైన రోడ్లకు ప్యాచ్ వర్కులు
జిల్లాలోని పలు ప్రధాన రహదారులు ముఖ్యంగా ఒంగోలు నుంచి కర్నూలు వైపు వెళ్లే రోడ్డు మార్గం, చీమకుర్తి వరకు కొంతమేర బాగున్నప్పటికీ ఆ తర్వాత క్వారీల వద్ద, మర్రిచెట్లపాలెం వద్ద రహదారి అధ్వానంగా ఉంది. అర కిలోమీటరు ప్రయాణానికి అర్ధగంటపైనే సమయం పడుతోంది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారులు ఆమ్మో.. ఆ రోడ్డులో కష్టమే అనే పరిస్థితి ఎదురైంది. ఇకపోతే ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు, కందుకూరు, అద్దంకితోపాటు, బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరుల్లోని పలు ప్రాంతాలలో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. అయితే అభివృద్ధిలో భాగంగా ప్రధానంగా రహదారులను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. గత కొన్నేళ్లుగా నిర్వహణ నిధులు కేటాయించకపోవడంతో సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఈ నేపఽథ్యంలో తొలుత రోడ్ల మరమ్మతులపైనే ప్రభుత్వం దృష్టిసారించగా, అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు నివేదికలను సమర్పించారు. ఆ తర్వాత కొత్తగా నిర్మాణం చేపట్టాల్సిన రోడ్లు, అందుకు అవసరమై నిధులను కోరుతూ ప్రతిపాదనలను పంపారు. నాలుగు నెలల క్రితం కొత్త రోడ్లకు ప్రభుత్వం నిధులు మంజూరుచేయగా, తాజాగా పలు రహదారులు, కనెక్టవిటీ రోడ్ల మరమ్మతులకు ఎండీఆర్ ప్లాన్, ఎస్‌హెచ్ ప్లాన్ కింద నిధులు కేటాయించడంతో జిల్లాలోని ఆర్‌అండ్‌బీ పరిధిలోని పలు రోడ్లకు మోక్షం లభించింది.
నిధుల కేటాయింపులు ఇలా..
జిల్లాకేంద్రంగా ఒంగోలు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సర్కిల్ పరిఽధిలో గతంలో బాపట్ల, కనిగిరి, ఒంగోలు, మార్కాపురం డివిజన్లు ఉన్నాయి. మార్కాపురం ప్రత్యేక జిల్లాగా మారడంతో ప్రస్తుతం మూడు డివిజన్‌లు అయ్యాయి. వాటిలో మార్కాపురం డివిజన్‌కు రూ.26.97కోట్లు, బాపట్ల డివిజన్ పరిధిలోని అద్దంకి, చీరాల, పర్చూరు నియోజకవర్గాలకు రూ.12.15 కోట్లు కేటాయించారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని కొండపి, సంతనూత లపాడు, కందుకూరు నియోజకవర్గాలకు రూ.17.74 కోట్లు మంజూరు చేశారు. కాగా గత వైసీపీ హయాంలో కనీస నిర్వహణ లేకపోవడంతోపాటు, అధ్వానంగా ఉన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియను ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రవినాయక్ మాట్లాడుతూ త్వరలోనే టెండర్‌ల ప్రక్రియను పూర్తి చేసి జిల్లాలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు.