Share News

మార్కాపురం జిల్లాకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:36 AM

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మార్కాపురం జిల్లాకు రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి

వెలిగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి

నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్‌

మార్కాపురం వన్‌టౌన్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా సమగ్ర అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం మార్కాపురం జిల్లాను ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. జిల్లాకు పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలన్నారు. విద్య, వైద్యం, నీటిపారుదల, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించి నూతన జిల్లాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ముంపు గ్రామాల బాధితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ మంజూరు చేయాలన్నారు. మార్కాపురం మెడికల్‌ కళాశాలను పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలన్నారు. కురిచేడు, దొనకొండ మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్వహణ కోసం సర్వం త్యాగం చేసిన ముంపు గ్రామాల బాధితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో సీపీఐ నాయకులు అందే నాసరయ్య, కేవీ కృష్ణగౌడ్‌, ఎస్‌కే ఖాసిం, రైతు సంఘం జిల్లా నాయకుడు దేవెండ్ల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 01:36 AM