వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి కల్యాణం
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:56 PM
మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న ఆమలక లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
మార్కాపురం వన్‌టౌన్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న ఆమలక లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు రఘునాథాచార్యులు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలకంరించి కల్యాణ ఘట్టాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వసంత దంపతులు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ నాయకులు డాక్టర్ డీవీ కృష్ణారెడ్డి, వరలక్ష్మి, సత్యనారాయణ రెడ్డి, యోగిరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు వితరణ కల్పించారు.