Share News

ఘనంగా ఇఫ్తార్‌ విందు

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:47 AM

రంజాన్‌ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు భారీగా ముస్లిం లు హాజరయ్యారు.. స్థానిక గుంటూరు రోడ్డులోని పీఏజీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమార్‌, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ పాల్గొన్నారు.

ఘనంగా ఇఫ్తార్‌ విందు
ప్రార్థన చేస్తున్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు జనార్దన్‌, విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రాజాబాబు తదితరులు

మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు

భారీగా పాల్గొన్న ముస్లింలు

ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ రాజాబాబు హాజరు

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : రంజాన్‌ సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు భారీగా ముస్లిం లు హాజరయ్యారు.. స్థానిక గుంటూరు రోడ్డులోని పీఏజీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ రాజాబాబు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయకుమార్‌, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ముప్పవరపు సుచిత్ర, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పార్థసారధి, ఆర్డీవో లక్ష్మీప్రసన్నతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పార్థనలు చేశారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు.

Updated Date - Mar 18 , 2026 | 02:47 AM