Share News

ఉద్యోగులకు పండుగ

ABN , Publish Date - Jan 18 , 2026 | 02:46 AM

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, సీపీఎస్‌ ఉద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. డీఏ అరియ ర్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్లపైగా అరియర్స్‌ అందాయి.

ఉద్యోగులకు పండుగ

డీఏ అరియర్స్‌ విడుదలతో ఆనందోత్సాహాలు

సీపీఎస్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు బ్యాంకు అకౌంట్లలో జమ

మిగిలిన వారికి జీపీఎఫ్‌ ఖాతాల్లో పడుతున్న నగదు

జిల్లావ్యాప్తంగా సుమారు రూ.వంద కోట్ల లబ్ధి

ఒంగోలు కలెక్టరేట్‌, జనవరి 17 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, సీపీఎస్‌ ఉద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. డీఏ అరియ ర్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్లపైగా అరియర్స్‌ అందాయి. ఒక్కో ఉద్యోగికి డీఏ బకాయి రూ.25వేల నుంచి రూ.90వేల వరకు వారివారి జీపీఎఫ్‌ అకౌంట్లలో.. సీపీఎస్‌, రిటైర్డ్‌ ఉద్యోగులకు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. గత వైసీపీ ప్రభుత్వంలో డీఏ అరియర్స్‌తోపాటు ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు అనేక ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులు, సీపీఎస్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆర్థికపరమైన అంశాలను పరిష్కరించిన కూటమి ప్రభుత్వం తాజాగా సంక్రాంతి సందర్భంగా 2018 డీఏ అరియర్స్‌ను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జిల్లావ్యాప్తంగా 25వేలమందికిపైగా రిటైర్డ్‌, మరో 14వేల మందికిపైగా సీపీఎస్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో 20వేల మంది వరకు రెగ్యులర్‌ వారు ఉన్నారు. ఇప్పటికే సీపీఎస్‌, రిటైర్డ్‌ ఉద్యోగులందరికీ దాదాపు పూర్తిస్థాయిలో అరియర్స్‌ పడ్డాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండటంతో వారి డీఏ అరియర్స్‌ను జీపీఎఫ్‌లో ప్రభుత్వం జమచేయడం ప్రారంభించింది. ఇప్పటికే వందలాది మంది ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్‌ అకౌంట్లలో జమకాగా మిగిలిన వారికి ప్రాధాన్యతక్రమంలో జమవుతున్నాయి.

Updated Date - Jan 18 , 2026 | 02:46 AM